హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): ఎరువుల రవాణా, స్టోరేజీ, హ్యాండ్లింగ్‌కు సంబంధించి నిబంధనల ప్రకారమే టెండర్లు నిర్వహిస్తున్నట్టు మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ఎరువుల గుట్టు ఎవరికెరుక..? శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన వివరణ ఇచ్చారు. కమిటీ నిర్ణయం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
టెండర్‌ను రెండేండ్లకు నిర్వహించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నామని, అయితే పేపర్ నోటిఫికేషన్లో తప్పులు దొర్లగా, వెంటనే వాటిని సవరించి మరో నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఆయన వివరించారు. నిరుడు ప్రభుత్వ అనుమతితో కొటాక్ మహేంద్రతో ఎంప్యానల్ అయినట్టు పేర్కొన్నారు.