తిమ్మాజిపేట, ఆగస్టు 28 : ‘మొరం కొట్టనిస్తలేరు.. కొట్టాలంటే అనుమతి కావాలంట.. అడిగితే అధికారులు ఇస్తలేరు’.. అం టూ నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మం డలం మరికల్ సర్పంచ్ రమాదేవి ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామ రహదారులు గుంతలమయంగా మారాయని, మురుగు ప్రాంతా ల్లో మట్టి కొట్టి చదును చేద్దామంటే అనుమతి ఇస్తలేరని వాపోయారు. శుక్రవారం వీధుల్లో ఉన్న మురుగుగుంతలను ఉసర్పంచ్ వెంకటయ్యతో కలసి ఆమె మీడియాకు చూపించారు.
వర్షాల కారణంగా రోడ్లు దుర్గంధభరితంగా మారి స్థానికులు ఇబ్బందులు పడ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామ శివారులో మట్టిని తీసుకుందామంటే అధికారులు అనుమతి ఇవ్వ డం లేదని ఆరోపించారు. గ్రామస్తులు సమస్యను తన దృష్టికి తీసుకొస్తున్నా.. ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నానని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి సర్పంచ్‌గా గెలిచినందుకే తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు.