హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) వరంగల్(Warangal) పార్లమెంట్ నియోజక వర్గ అభ్యర్థి(BRS MP candidate) డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ సోమవారం నామినేషన్(Nomination) వేశారు. బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కాళోజీ నారాయణరావు విగ్రహం వరకు పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను వరంగల్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రావిణ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.