హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టు పార్టీ సభ్యురాలు, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న భార్య శ్రీవిద్యను కంది జైలుకు తరలించారు. నాంపల్లిలోని తన సోదరుడు నార్ల రవివర్మ ఇంట్లో తలదాచుకున్న విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్ పోలీసులు ఆమెను గురువారం అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు తర్వాత ఆమెకు కోర్టులో హాజరుపర్చకపోవడంతో పలు పౌరసంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. దీంతో ప్రభుత్వం ఆమెను కోర్టులో హాజరుపర్చక తప్పలేదు. శుక్రవారం మియాపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టులో ఆమెను హాజరుపర్చారు.