హైదరాబాద్, సెప్టెంబర్13 (నమస్తే తెలంగాణ): గాంధీ వారసులమని చెప్పుకొనే కాంగ్రెస్.. తెలంగాణలో గాడ్సే పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత తుంగ బాలు మండిపడ్డారు. తనను హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీసిన ప్రతిసారీ కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటీవల ఖమ్మం, సిద్దిపేటలో హరీశ్‌రావుపై, నిన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడులు చేశారని చెప్పారు. రేవంత్ పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేవంత్‌కు తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ ఒక ప్రకటనలో విమర్శించారు. న్యాయం కోసం ఆందోళనకు దిగిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లలో నిర్బంధించడం కాంగ్రెస్ సర్కారు అరాచకాలకు పరాకష్ఠ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, ప్రజావ్యతిరేక దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. ఉద్యమపార్టీ అయిన బీఆర్ఎస్కు అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలు కొత్తకాదని, అణిచివేయాలని చూస్తే ఉప్పెనలా పైకిలేస్తామని తెలిపారు.