హైదరాబాద్, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): సీఎం సహాయ నిధికి వరద విరాళాలు భారీగా వస్తున్నాయి. శని,ఆదివారాల్లో పలువురు ప్రముఖులు, పలు కంపెనీలకు చెందిన పెద్దలు సీఎం రేవంత్‌రెడ్డిని నేరుగా కలిసి విరాళాలు అందజేశారు. కాగా, వినాయకచవితి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, కుటుంబసభ్యులు, టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ దంపతులు వినాయకపూజలో పాల్గొన్నా రు. అనంతరం వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.