మంథని, అక్టోబర్ 15 : పెద్దపల్లి జిల్లా మంథని ఆర్డీవో హనుమానాయక్‌ను హైదరాబాద్‌లోని భూపరిపాలన ప్రధాన కమిషనరేట్‌కు సరెండర్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, నేషనల్ హైవే అథారిటీ, భూసేకరణ, ఆర్అండ్ఆర్తోపాటు సాధారణ ఫిర్యాదులకు హాజరుకావడంలో నిర్లక్ష్యం వహించడం, ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో ఆలస్యం, కోర్టు ఆదేశాలను పాటించడంలేదని పేర్కొంటూ హనుమానాయక్‌ను సరెండర్ చేశారు. కాగా పెద్దపల్లి ఆర్డీవో గంగయ్యకు మంథని ఆర్డీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.