హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్‌లో అడ్వకేట్ మొహినుద్దీన్ హత్యను బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. మొహినుద్దీన్ పోరాడుతున్నది వక్ఫ్ భూముల కోసమని ఆయన తెలిపారు. హత్యలో వక్ఫ్ భూముల స్వాహాకు పాల్పడుతున్న వారి హస్తం ఉందా అనేది తెలియాలని అన్నారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోతున్నారని మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఇంత బహిరంగంగా హత్య జరిగితే కనీసం రివ్యూ కూడా చేయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలోనే ఉన్నారా.. ఢిల్లీకి వెళ్లారా అనేది తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. రోజురోజుకూ పెరుగుతున్న క్రైమ్ రేట్‌ను ఎందుకు అదుపు చేయడం లేదని ప్రశ్నించారు. ఇది పోలీస్ రాజ్యం కాదు.. మాఫియా రాజ్యమని కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేనే అన్నారని క్రిశాంక్ గుర్తుచేశారు. ఇప్పటికైనా హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నేరాలపై రివ్యూ చేయాలని సూచించారు.
పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్‌లో అడ్వకేట్ మొహినుద్దీన్ హత్యా ప్రయత్నం స్థానికంగా కలకలం రేపింది. తన కారు వద్దకు వెళ్లి డోర్ తీస్తుండగా వెనుక నుంచి ఓ మరో కారులో దుండగులు వేగంగా వచ్చి మొహినుద్దీన్ ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఖాజా మొయినుద్దీన్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మృతి చెందాడు. కాగా తన తండ్రి హత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖానే అని ఖాజా మొయిజుద్దీన్ హత్యపై అతని కుమారుడు ఫర్హాన్ ఆరోపించాడు. వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆలం ఖాన్, అతడి తండ్రి ఆక్రమించి కాలేజీలు నిర్మించారని.. వాటి గురించి ఎప్పటినుండో కేసులు వేస్తూ.. మా ఫాదర్ ఖాజా మొయిజుద్దీన్ పోరాటం చేస్తున్నారని ఫర్హాన్ తెలిపాడు. గత ఆరు నెలల క్రితం అలంఖాన్ మా ఆఫీసుకు వచ్చి నన్ను బెదిరించాడు. గతంలో మా ఆఫీసులకు వచ్చి మరీ దాడులు చేశారు. మా తండ్రిపై దాడి జరగడం ఇది ఆరోసారి. ఇప్పుడు నాకు గానీమా కుటుంబానికి కానీ ఏం జరిగినా ఆలం ఖాన్ దే బాధ్యత అని ఫర్హాన్ అన్నాడు. నాకు నా కుటుంబానికి రక్షణ కలిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఫర్హాన్ పేర్కొన్నాడు.