నిర్మల్ అర్బన్, మే 8 : రాష్ట్ర ఖనిజాబివృద్ధి శాఖ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నె క్రిశాంక్‌కు శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కోర్టు జడ్జి బెయిల్ మంజూరు చేశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నేత రాజేంద్రకుమార్ ఇంటికి వెళ్లి గొడవ చేశారన్న ఆరోపణలపై కూకట్పల్లి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
2024లో ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన పాత కేసులో పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో పాటు పలు స్టేషన్లలో కేసులు నమోదు కాగా పీటీ వారెంట్‌లో భాగంగా శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కోర్టుకు ఆయనను పోలీసులు తీసుకువచ్చారు. సీనియర్ సివిల్ కోర్టు జడ్జి విచారించి బెయిల్ మంజూరు చేశారు. నిర్మల్ నుంచి ఆయనను సంగారెడ్డి జైలుకు పోలీసులు తీసుకువెళ్లారు.