నిర్మల్ అర్బన్, మే 7 : కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నేత రాజేంద్రకుమార్ ఇంటికి వెళ్లి గొడవ చేశారన్న ఆరోపణలపై కూకట్పల్లి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం విదితమే.
దీంతోపాటు పలు స్టేషన్లలో కేసులు నమోదు కాగా పీటీ వారెంట్లో భాగంగా గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అతడిని పోలీసులు తీసుకొచ్చారు. కోర్టుకు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో మీడియాతో క్రిశాంక్ మాట్లాడారు. చట్టాలపై తనకు పూర్తిగా నమ్మకముందని చెప్పారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు.