Dhanda Nyoliwala | ఓటీటీని షేక్ చేసిన ‘మిర్జాపూర్’ ఇప్పుడు ‘మిర్జాపూర్: ది మూవీ’ పేరుతో రాబోతేన్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ కంటే ఈ మూవీలో మరింత్ యాక్షన్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో ఒక హై-ఎనర్జీ మాస్ రాప్ సాంగ్ కోసం హర్యానా పాపులర్ రేపర్ ధాండా న్యోలీవాలాను మేకర్స్ రంగంలోకి దించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలోని రా ప్రపంచానికి ఆయన ధాండా న్యోలీవాలా వాయిస్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. దీంతో అతడితో ఒక మాస్ సాంగ్ పాడించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాట సినిమాకే హైలైట్గా నిలవబోతుంది.
పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అమెజాన్ MGM స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4, 2026న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది.