Manipur | హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సహజ సంపద, వనరుల లూటీ చేయాలనే కార్పొరేట్ దురాశకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాజకీయ అండదండలే మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలకు ప్రధాన కారణమని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత, జాతీయ కార్యదర్శి బివొయ్ విశ్వం ఆరోపించారు. విశాలాంధ్ర మాజీ సంపాదకుడు సీ రాఘవాచారి జయంతిని పురసరించుకొని రాఘవాచారి ట్రస్ట్, నీలం రాజశేఖర్‌రెడ్డి పరిశోధనా కేంద్రం, సీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో ఆదివారం ‘మణిపూర్ ఒక రాజకీయ విశ్లేషణ’ అంశంపై జరిగిన సదస్సుల్లో ఆయ న కీలకోపన్యాసం చేశారు.
బీజేపీ కుటిల, సుంకుచిత రాజకీయాలకు మణిపూర్ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని, అకడ హింసకు ముగింపు ఎప్పుడో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఐడీపీడీ ఉపాధ్యక్షుడు డాక్టర్ రజినీ తదితరులు పాల్గొన్నారు.