హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టో హామీలను తక్షణమే అమలుచేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాచిగూడలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త పీఆర్సీ, పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులపై ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి జీ సదానందంగౌడ్ మాట్లాడుతూ.. జీవో-317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, డీఎస్సీ-2003 టీచర్లకు పాత పింఛన్ అమలుచేయాలని కోరారు. సమావేశంలో ఆట సదయ్య, కృష్ణారెడ్డి, బీ రవి, జుట్టు గజేందర్, ఏవీ సుధాకర్, కరుణాకర్‌రెడ్డి, రాధ, జయలక్ష్మి పాల్గొన్నారు.