కొత్తూరు, జూన్ 14: నేషనల్ హైవే 44పై తిమ్మాపూర్ వద్ద మామిడి పండ్ల లారీ బోల్తా పడగా లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపు మామిడి పండ్లతో వెళ్తున్న లారీ శనివారం ఉదయం నేషనల్ హైవే 44పై చేగూరు రోడ్డు వద్ద అదపు తప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. లారీ బోల్తా పడటంతో 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీలో ఉన్న మామిడి పండ్లు రోడ్డుపై చిందరవందరగా పడ్డాయి. ప్రజలు మామిడి పండ్లు తీసుకెళ్లేందుకు సంచులు, బుట్టలతో ఎగబడ్డారు.