యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి దర్శించుకున్నారు. సోమవారం యాదాద్రికి చేరుకున్న ఆమె మొదటగా స్వయంభూలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. అంతకుముందు భువనగిరి మండలంలోని వనపర్తి గ్రామంలో స్మార్ట్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి, జిల్లా ఆదనపు కలెక్టర్ దీపక్ తివారి పాల్గొన్నారు.