లారీ, బైక్ ఢీకొని ఒకరి సజీవదహనం
లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకున్నది.
- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘటన
బెల్లంపల్లి రూరల్, డిసెంబర్ 9: లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకున్నది. బెల్లంపల్లిలోని ఐబీ టౌన్‌కు చెందిన తోట రవి (30) శనివారం సాయంత్రం బైక్‌పై మంచిర్యాల వైపు వెళ్తుండగా, బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల పంచముఖి విగ్రహం చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో లారీ బైక్‌ను కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది.
ఈ ప్రమాదంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బైక్ నడుపుతున్న రవికి మంటలు అంటుకోవడంతో సజీవ దహనమయ్యాడు. బైక్ కూడా పూర్తిగా కాలిపోయింది. వన్‌టౌన్ సీఐ బన్సీలాల్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

