హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంలో నిధుల నిర్వహణపై చెక్ పవర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్‌కు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. గురువారం ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జీవో జారీచేశారు. మొదట నలుగురికి కలిపి జాయింట్ చెక్‌పవర్ ఇచ్చారు. దీనిని సవరిస్తూ.. హెడ్మాస్టర్, స్కూల్మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌కే చెక్ పవర్ కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.