జగిత్యాల: కుటుంబ తగాదాలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. కుటుంబంలో గొడవలు చినికిచినికి గాలివానలా మారడంతో ఓ వ్యక్తి భార్యను హతమార్చి ( Murder ), ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాచుపల్లి గ్రామానికి చెందిన బత్తిని దేవయ్య, ప్రమీల ఇద్దరూ భార్యాభర్తలు. వారి ఇంట్లో ఈ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ దేవయ్య భార్యను హత్యచేశాడు. అనంతరం అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మాల్యాల సీఐ, కొడిమ్యాల ఎస్ఐ ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.