హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): సమ్మక్క సారక్క బరాజ్ ముంపు ప్రభావంపై ఐఐటీ రూర్కీ అధ్యయనం కొనసాగిస్తున్నదని, ఆ అధ్యయన నివేదిక వచ్చిన తర్వాతే ఎన్వోసీ మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయి తేల్చిచెప్పారు. గురువారం రాత్రి హైదరాబాద్‌కు విచ్చేసి, పార్క్‌హయత్ హోటల్లో బసచేసిన ఆయనను తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారుల బృందంతో కలిసి మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా కలిశారు. సమ్మక్క బరాజ్‌కు నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ)ని అందజేసి తెలంగాణకు సహకరించాలని ఛత్తీస్‌ఘడ్ సీఎంను కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినతి పత్రాన్ని అందజేశారు.