ఆదిబట్ల, జూన్ 12 : రంగారెడ్డి కలెక్టరేట్లోని ఎస్టీ కార్పొరేషన్ ఉద్యోగి శ్రీ ధర్‌బాబు ఆత్మహత్య కేసు రోజుకో మ లుపు తిరుగుతున్నది. ఉన్నతాధికారుల వేధింపులతోనే శ్రీధర్‌బాబు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ స భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో విచారణ చేపట్టిన పోలీసులకు భారీ ఆర్థిక కుంభకోణం బయటపడినట్టు తె లుస్తున్నది. ఈ నెల ఒకటిన శ్రీధర్‌బాబు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం జరిగిన విచారణలో శ్రీధర్‌బాబు ఎస్సీ కార్పొరేషన్ నిధులు రూ.33,36, 500 ప్రభుత్వ నిధులు సొంతానికి వాడుకున్నట్టు అనుమానిస్తున్నారు. శ్రీ ధర్‌బాబు ఎస్టీ కార్పొరేషన్ అధికారి రామేశ్వరి సంతకాన్ని ఫోర్జరీ చేసి నాలు గు చెక్కుల ద్వారా పలు ఖాతాలకు రూ.33,36,500 బదిలీ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. నలుగురు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు చెందిన పలు శాఖల మేనేజర్లపై క్రిమినల్ కేసు లు నమోదైనట్టు తెలిసింది. ఎస్టీ కార్పొరేషన్లో జూనియర్ అసిస్టెంట్-కమ్-లోన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడును కలెక్టర్ ఈ నెల 9న సస్పెండ్ చేశారు.