MLA Anirudh Reddy | రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
MLA Anirudh Reddy | దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారని తెలిసిందే.
MLA Anirudh Reddy | నాకు నీతులు చెప్పే బదులు ముందు రేవంత్ రెడ్డికి నీతులు చెప్పు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు రాజగోపాల్ రెడ్డి సూచించారని తెలిసిందే. పక్క పార్టీలో నుండి ఎమ్మెల్యేలను తీసుకున్నందుకు జనాల్లో కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం పోయిందన్నారు. దానం నాగేందర్ లాంటి వాళ్లను చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుందని చెప్పారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.. అని నిర్దేశించారు.
ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూ మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒక అగ్నిపర్వతం.. వోల్కానో.. ఆయనకు కోపమొచ్చిందంటే ఒక అగ్నిపర్వతం పేలినట్టు పేలుతది. ఆయన ఎప్పుడూ కూడా మంత్రి పదవి కావాలని కొట్లాడలేదు.. అడగలేదు.. రెండున్నర సంవత్సరాలు అయింది.. అయి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి సమస్యల మీద అడుగుతుండు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేం లేదు. నేను కూడా సమస్యల గురించి చాలా సార్లు మాట్లాడాను. సమస్యలున్నాయి.. వాటిని పరిష్కరించుకుంటే మా పార్టీకే మంచి పేరొస్తది కదా..కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని మాట్లాడిండు అన్నారు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేం లేదు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలనే రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడాడు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వాడు
ఈ… https://t.co/NK0KaTHqJZ pic.twitter.com/yBCbuxKZq8
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2026
Read Also :
Weekend OTT | ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన చిత్రాలివే!
FBI Report | అమెరికాలో భారీగా తగ్గిన హత్యల రేటు.. గడిచిన 75 ఏళ్లలో అత్యంత కనిష్ఠం..!
Rosemary Oil | జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోజ్మేరీ ఆయిల్..అధ్యయనంలో వెల్లడి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

