కామారెడ్డి: ప్రియురాలు సరిగా మాట్లాడటం లేదని ఆత్మహత్య చేసుకోబోయాడు ఓ యువకుడు. కామారెడ్డికి చెందిన నరేశ్ అనే 21 ఏండ్ల యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే కొంతకాలంగా నరేశ్‌తో ఆమె సరిగా మాట్లాడటంలేదు. దీంతో మనస్తాపానికి గురైన అతడు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గుర్తించిన స్థానికులు నిజామాబాద్ దవాఖానకు తరలించారు.