సంగారెడ్డి : అమీన్పూర్(Aminpur) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..అమీన్పూర్లో నివాసముంటున్న బానోతు గోపాల్ నాయక్ (42)ను సొంత బావమరిది నరేష్ నాయక్ తన మిత్రునితో కలిసి హత్య చేశాడు. మృతదేహాన్ని అమీన్పూర్ పరిధిలోని స్మశాన వాటికలో వదిలి వెళ్లారు. బావ, బామ్మర్ది కలిసి జేసీబీ వాహనాన్ని కొనుగోలు చేశారు.
బావను హత్య చేస్తే అతని పేరుపై ఉన్న జేసీబీ ఇన్స్‌రెన్స్ మాఫీ అవుతుందని హత్య చేసినట్లు సమాచారం. కాగా,వీరి స్వగ్రామం మెదక్ జిల్లా పాపన్నపేట్కు చెందిన వారిగా గుర్తించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పటాన్చెరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.