శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 22 : భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది పైలట్‌కు సమాచారం ఇచ్చారు. పైలట్ వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులతో మాట్లాడి ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుడు కృష్ణప్ప(75)ను ఎయిర్‌పోర్ట్‌లోని అపోలో దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
సింగపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఎస్క్యూ – 522 విమానంలో వచ్చిన రాజవేలు పూవురాసన్ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని కస్టమ్స్, ఏఐయూ బృందాలకు అప్పగించారు. అతడి బ్యాగును తనిఖీ చేసి, 18 డ్రోన్లు(కెమెరా)లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రోన్ల విలువ రూ.13 లక్షలు ఉంటుందని వెల్లడించారు.