తురపల్లి జూన్ 23 : నకిలీ పత్తివిత్తనాలను విక్రయించేందుకు తరలిస్తున్న ము ఠాలో ఒకరిని అరెస్ట్ చేసినట్టు యాదాద్రి డీఎస్పీ శ్రీనివాస నాయుడు మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం, కేశనపల్లికి చెందిన దొండపాటి మల్లికార్జునరావు, చిత్తూరు జి ల్లా కొత్తకోటకు చెందిన శంకర్ గుంటూరు నుంచి నిషేధిత నకిలీ బీజీ -2 పత్తి విత్తనాలను సిద్దిపేటలో విక్రయించేందుకు తరలిస్తున్నారు.
పకా సమాచారంతో తురపల్లి బస్టాండ్ వద్ద ఎ స్సై, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన తనిఖీల్లో బిల్లా బీజీ-2999 పేరుతో ఉన్న రూ.10 లక్షల విలువగల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దొండపాటి మల్లికార్జున్రావును అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు శంకర్ పరారీలో ఉన్నాడు.