హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో ముందడుగు పడిం ది. తెలుగు బిడ్డ రామ్మోహన్ నాయు డు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఈ ఎయిర్‌పోర్టు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్న ల్ లభించింది. ఎయిర్‌పోర్టు విస్తరణ కు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.
తెలంగాణలో 6 ప్రాంతీయ ఎయిర్‌పోర్టులను ఏర్పా టు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభు త్వం ప్రతిపాదించింది. దీనిపై అధ్యయనం కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) టెక్నో ఎకనమిక్ ఫీసబిలిటీ రిపోర్ట్ (టీఈఎఫ్ఆర్) కన్సల్టెంట్‌ను ఏర్పాటు చేయడంతో సంబంధిత కమిటీ మామునూరు ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు యాజమాన్యం గత నెల 23న నిరభ్యంతర పత్రాన్ని జారీచేసింది. దీంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు అవసరమైన నిధులు విడుదల చేయడంతోపాటు త్వరగా భూసేకరణ పూర్తిచేయాలని వరంగల్ కలెక్టర్‌ను ఆదేశించింది.