నిర్మల్ : బాధితుడిచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా లంచం( Bribe ) తీసుకున్న ఎస్సైను ఆదిలాబాద్ యూనిట్ ఏసీబీ అధికారులు( ACB Officials ) రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా మామడ పోలీస్స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న టి అశోక్( SI Ashok ) గురువారం ఎస్సై క్వార్టర్లో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు.
ఓ కేసులో వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకుండా ఉండడానికి ఓ వ్యక్తి ఎస్సైని సంప్రదించగా అందుకు డబ్బులు డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని ఎస్సైను పట్టుకున్నారు. విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినందుకు గాను ఎస్సైపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఎస్సైను అరెస్టు చేసి కరీంనగర్లో హాజరు పరిచామని అధికారులు వివరించారు.