హైదరాబాద్, ఆగస్టు 17(నమ స్తే తెలంగాణ) : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వివాదంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి ఎంత చెప్పినా వినకుంటే వేటు తప్పదంటూ హెచ్చరించారు. ఆదివారం గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి అంశంపై పీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తనతో చర్చించారని, దీనిపై సమాచారం తెప్పించుకొని పరిశీలిస్తానని స్పష్టంచేశారు. మంత్రి పదవి విషయంలో రాజగోపాల్‌రెడ్డి పదే పదే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనిపై వివరాలు సేకరిస్తున్నామని, పూర్తి వివరాలు వచ్చాక వచ్చే వారం మరోసారి సమావేశమై చర్చిస్తామని చెప్పారు. ఇక వరంగల్ జిల్లా నేతల పంచాయితీపై నలుగురు సభ్యులతో కమిటీని నియమించనున్నట్టు తెలిపారు.