మేడ్చల్, (నమస్తే తెలంగాణ)/హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 14: మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీ, వరంగల్‌లోని ఎస్సార్ యూనివర్సిటీకి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) న్యూ ఢిల్లీ నుంచి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, పరిశోధన విస్తరణ రంగాల్లో ఐసీఏఆర్ గుర్తింపు అత్యున్నత ప్రమాణంగా భావించబడుతున్నది. వ్యవసాయరంగంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలపై ఈ వర్సిటీలు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు దక్కింది. సూల్ ఆఫ్ అగ్రికల్చర్, బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్ ప్రోగ్రామ్ రెండింటికీ గుర్తింపు లభించిందని ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. ఐసీఏఆర్ గుర్తింపు పొందిన డిగ్రీలు దేశీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతాయని, విద్యార్ధులు ఐసీఏఆర్ సాలర్షిప్స్, ఫెలోషిప్స్నకు అర్హత పొందుతారని తెలిపారు.
ఇంటర్లో జర్మన్ ైస్టెల్ డ్యూయల్ అప్రెంటిస్‌షిప్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యలో సమూలమార్పులకు అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. కొత్తగా జర్మన్ ైస్టెల్ డ్యూయల్ అప్రెంటిస్‌షిప్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రణాళిక రూపొందించారు. ఈ విధానంలో విద్యార్థులు వారంలో మూడు, నాలుగు రోజులు పరిశ్రమల్లోనే గడపాల్సి ఉంటుంది. వారానికి రెండు రోజులు మాత్రమే విద్యార్థులు కాలేజీకి వస్తారన్నమాట. ఇలాంటి అనేక ప్రణాళికలు ఇంటర్‌విద్య అధికారులు సిద్ధం చేసి, సర్కార్‌కు సమర్పించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, యూనివర్సిటీలతో అనుసంధానించాలని నిర్ణయించారు. అప్రెంటిస్‌షిప్ కోసం కాలేజీలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. నెలకు కొంత పారితోషికం సైతం ఇస్తారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పెద్ద ఎత్తున ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. 33 జిల్లాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు నెలకొల్పుతారు. రాబోయే రోజుల్లో రూ. 103 కోట్లు ఖర్చుచేయనున్నారు. తొలుత 200 కాలేజీల్లో స్కిల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చి, టీహబ్, ఇక్యుబేంటర్లతో అనుసంధానం చేస్తారు. ఆ తర్వాత మరో 230 కాలేజీలకు విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.