గంగాధర : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌లో రైతు పిట్టల ప్రశాంత్ తన ఎకరం పొలాన్ని కాపాడుకునేందుకు గురువారం ఒక్కో ట్యాంకర్‌కు రూ.500 చొప్పున 10 ట్యాంకర్లకు రూ.5వేలు వెచ్చించి నీరందించాడు. చెరువు, బావిలో నీళ్లు లేక ట్యాంకర్లతో నీటిని పెట్టే దుస్థితి వచ్చిందని వాపోయాడు.

మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేటకు చెందిన రైతు కందూరు రాములు ఎకరన్నరలో వరి, అర ఎకరంలో కూరగాయలు సాగు చేశాడు. బోరులో నీటిమట్టం తగ్గడంతో తోటను కాపాడుకునేందుకు వారం రోజులుగా బిందెల సాయంతో నీళ్లు తెచ్చి పంటను రక్షించుకుంటున్నాడు.
-మూసాపేట

ఎండలు మండుతుంటే మనుషులే కాదు, పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. పొద్దంతా వేడిగాలులతో తండ్లాడుతున్నాయి. దీంతో పెద్దపల్లి జిల్లా పిట్టల ఎల్లయ్యపల్లెకు చెందిన రైతు యాదగిరిస్వామి ఆవుల కోసం వేసిన షెడ్లో కూలర్లను పెట్టి, చల్లనిగాలిని అందిస్తున్నాడు.
-ఓదెల