Kadiyam Srihari | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యల గురించి వదిలేసి, మొక్కల గురించి మాట్లాడటంపై మల్కాపూర్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కడియం శ్రీహరి బొమ్మకు వినతి పత్రం సమర్పించారు.
మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ఇస్తానన్న రూ.2,500 గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఈ సందర్భంగా కడియం శ్రీహరిని మహిళలు నిలదీశారు. ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే ఇస్తానన్న తులం బంగారం, రైతు భరోసా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో మల్కాపూర్ గ్రామాన్ని మండలం చేస్తానని హామీ ఇచ్చిన సంగతి గుర్తుచేశారు. మల్కాపూర్ గ్రామాన్ని మండలం చేయడాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు.