హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): బాలికపై లైంగిక దాడి కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్‌ను పోలీసులు 3 రోజులపాటు కస్టడీలోకి అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ నిమిత్తం నిందితుడిని వారం రోజులపాటు తమ కస్టడీ ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టును కోరడంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దీంతో పోలీసులు బుధవారం చర్లపల్లి జైలు నుంచి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు. కస్టోడియల్ విచారణలో నిందితుడి నుంచి పోలీసులు మరింత సమాచారాన్ని సేకరించడం ద్వారా ఈ కేసుతో సంబంధమున్న ఇతరులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. భగీరథ్‌పై ఈ నెల 8న హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది.