Group-2 Results | హైదరాబాద్ : గ్రూప్ -2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. జనరల్ ర్యాంకుతో పాటు ఫైనల్ కీని విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఇక ఈ ఫలితాల్లో పురుష అభ్యర్థులు సత్తా చాటారు. టాప్ టెన్ ర్యాంకులతో పాటు 31వ ర్యాంకు వరకు పురుష అభ్యర్థులే ఉన్నారు. లక్కిరెడ్డి వినిషా రెడ్డికి 32వ ర్యాంకు వరించింది. వినిషారెడ్డికి 408 మార్కులు వచ్చాయి. టాప్ టెన్ అభ్యర్థుల్లో ఐదుగురు ఓసీలు కాగా, మిగతా ఐదుగురు బీసీ కేటగిరికి చెందిన అభ్యర్థులు ఉన్నారు. టాప్ 50లో ఇద్దరు ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు.
నారు వెంకట హరవర్ధన్ (ఓసీ) (మల్టీజోన్ -1) – 447.088
వడ్లకొండ సచిన్ (ఓసీ) (మల్టీజోన్ -1) – 444.754
బీ మనోహర్ రావు (బీసీ-డీ) (మల్టీజోన్ -2) – 439.344
శ్రీరామ్ మధు (బీసీ-బీ) (మల్టీజోన్ -2) – 438.972
చింతపల్లి ప్రీతమ్ రెడ్డి(ఓసీ) (మల్టీజోన్ -1) – 431.102
అఖిల్ ఎర్ర (ఓసీ) (మల్టీజోన్ -2) – 430.807
గొడ్డేటి అశోక్ (బీసీ-బీ) (మల్టీజోన్-1) – 425.842
చిమ్ముల రాజశేఖర్(ఓసీ) (మల్టీజోన్-2) – 423.933
మేకల ఉపేందర్ (బీసీ-డీ) (మల్టీజోన్-1) – 423.119
కరీంగు నరేశ్(బీసీ-బీ) (మల్టీజోన్ -2) – 422.989