ఖలీల్వాడి/కోటగిరి, ఫిబ్రవరి 6: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లాలో మాల కులస్తులు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంతో పాటు కోటగిరిలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం వెంటనే బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలకు అన్యాయం జరిగిందని మాల మాహానాడు నాయకులు తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు గాదె కుమార్, యాలాల శ్రీనివాస్, గుయ్యని పామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మాలలు ఉంటే 19 లక్షలు మాత్రమే ఉన్నారని పేర్కొనడం సరైందికాదని వెల్లడించారు.
– కందుకూరు, ఫిబ్రవరి 6