సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 4: ప్రభుత్వరం గంలో రిజర్వేషన్లు లేకుండా మాలల గొంతు కోసింది సీఎం రేవంత్‌రెడ్డేనని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భా స్కర్ విమర్శించారు. సిరిసిల్లలో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా మాలల ఐక్య వేదిక ఆ ధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను విస్మరించి మాల సామాజికవర్గానికి ఆరు నెలలు గా రిజర్వేషన్లు లేకుండా చేసి గొంతుకోసింది రేవంత్‌రెడ్డి సర్కారేనని ధ్వజమెత్తారు.
శాతవాహన యూనివర్సిటీ అసిస్టెంట్, కాంట్రాక్టు ప్రొఫెసర్, ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి వెయ్యి పోస్టులుంటే మా ల సామాజికవర్గానికి 28పోస్టులు మాత్రమే వచ్చాయని చెప్పారు. ఇంత అన్యాయం జరుగుతున్నా మాల రిజర్వేషన్ పొందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గడ్డం వివేక్ వెంకటస్వామి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, అద్దంకి దయాకర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయంగా బొంద పెట్టేందుకు రేవంత్‌రెడ్డి చేసిన కుట్రను అందరికీ తెలియజేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చామని చెప్పారు.