Vakiti Srihari | మహబూబ్‌నగర్ : కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నరంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. తాజాగా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిపై ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అవినీతి చేశాడంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మక్తల్ కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగా లేఖ రాశారు. ఎన్నికలకు ముందు డబ్బులు లేవని అప్పులు తీసుకున్న వాకిటి శ్రీహరి ఇప్పుడు తన ఇంటి పక్కనున్న మరో ఇల్లును కోటి 50 లక్షలు పెట్టి ఎలా కొన్నాడు? అని ప్రశ్నించారు. అలాగే లహరి కన్వేషన్ పక్కన 100 గజాల స్థలం, హైదరాబాద్‌లో 5 ప్లాట్లు, భూత్పూర్ దగ్గర 10 ఎకరాల భూమి, కుటుంబసభ్యులు తిరగడానికి 5 కార్లు ఎలా వచ్చాయి? అని నిలదీశారు.
వైన్ షాపులో పని చేసే నాగరాజు అనే వ్యక్తి వాకిటి శ్రీహరి గెలిచాక కోట్ల రూపాయలకు ఎలా పడగెత్తినాడు? వాకిటి శ్రీహరి అనుచరులు కల్లు మామ్ల చేసుకునే గౌడ కులస్తులతో మామూళ్లు ఎందుకు వసూలు చేస్తున్నారు? వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే మక్తల్ మొత్తం నాశనం అవుద్ది అంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలోని పలువురు పెద్దలకు మక్తల్ కాంగ్రెస్ కార్యకర్తలు లేఖలు రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ లేఖపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అవినీతి చేశాడంటూ రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మక్తల్ కాంగ్రెస్ కార్యకర్తలు
ఎన్నికలకు ముందు డబ్బులు లేవని అప్పులు తీసుకున్న వాకిటి శ్రీహరి ఇప్పుడు తన ఇంటి పక్కనున్న మరో ఇల్లును కోటి 50 లక్షలు పెట్టి ఎలా కొన్నాడు?
అలాగే లహరి కన్వేషన్ పక్కన 100 గజాల… pic.twitter.com/sUvSM10jDI
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2025
ఇవి కూడా చదవండి..
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి.. ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలి : హరీశ్‌రావు
Telangana | త్వరలో 20 శాతం పెరగనున్న మద్యం ధరలు.. చీప్ లిక్కర్‌పై సుంకాలు తగ్గించే యోచన లేనట్టే!