బిచ్కుంద/పెద్దకొడప్గల్, డిసెంబర్ 13: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలకు మోస పోయి, మరోసారి గోస పడవద్దని, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని హస్గుల్, చిన్నదడ్గి, పెద్దదడ్గి, రాజాపూర్ గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి శనివారం పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. బెదిరింపులు, దౌర్జాన్యాలకు పాల్పడే వారికి పంచాయతీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించవద్దని సూచించారు. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి తప్ప, కాంగ్రెస్సర్కారు చేసిందేమీలేదన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
పెద్దకొడప్ మండలంలోని బేగంపూర్, వడ్లం, రతన్‌సింగ్ తండాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిన్న దేవీసింగ్ తండా పంచాయతీ పరిధిలోని రతన్ సింగ్ తండావాసులందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానించుకొని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తండా ప్రజలు తెలిపారు.