Unseasonal Rains | రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో అకాల వర్షాలు ( Unseasonal Rains) బీభత్సం సృష్టించిందని తెలిసిందే. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులంతా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎదురుచూసిన రైతన్నలకు అకాల వర్షాలు మరింత కుదేలయ్యేలా చేశాయి.
కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాలతోపాటు వేములవాడ, ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం మేడిగూడ, యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా వ్యవసాయ మార్కెట్లో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. పలు జిల్లాల్లో రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు పలు మార్కెట్ యార్డుల్లో వడ్లు వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షానికి తడిసిముద్దైన ధాన్యం
నెల రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనకపోవడంతో.. రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద పలుచోట్ల తడిసిన మొక్కజొన్న, వరి ధాన్యం
పలు మండలాల్లో భారీ ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం
లోతట్టు ప్రాంతాల్లో… pic.twitter.com/pFHgFimbpA
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026
నాగర్ కర్నూల్ జిల్లా pic.twitter.com/HrTNbIyK0J
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026
యాదాద్రి జిల్లా, తుర్కపల్లి మండలం pic.twitter.com/nt41lEvPXz
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026
ఆదిలాబాద్ జిల్లా, సాత్నాల మండలం మేడిగూడ pic.twitter.com/yeV6c87LSl
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ pic.twitter.com/abf9rsCEcb
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026