నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నెల్లికొండ చౌరస్తాలో శుక్రవారం మొక్కజొన్న రైతులు ( Maize Farmers ) ఆందోళనకు దిగారు. గత 15 రోజులుగా తమ కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయని, గన్ని బ్యాగులు ఇవ్వడం లేదని, కొనుగోలు నిలిపివేశారని ఆగ్రహం చేస్తూ శుక్రవారం మరోసారి రైతులు నిరసన కు దిగారు.
అదే దారిలో కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమావేశానికి వెళుతున్న నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ( MLA Rajesh Reddy ) , అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ( MLA Vamsi Krishna ) ను మొక్కజొన్న రైతులు అడ్డుకున్నారు. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయకుండా రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యేలను నిలదీశారు. రైతులు అడుగుతున్న ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.