మక్క పంట అగ్నికి ఆహుతి
ఆరుగాలం క ష్టపడి పండించిన మక్క పంట అగ్నికి ఆ హుతైంది. మహబూబాబాద్ జిల్లా బ య్యారం మండలం చెరువుముందు కొత్తగూడెం శివారులోని ఓ రైతు మక్కపంటకు శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకున్నది.
- 200 ఎకరాలు బుగ్గి.. 50 ఎకరాల్లో పంటనష్టం
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో ఘటన
బయ్యారం, ఏప్రిల్ 25: ఆరుగాలం క ష్టపడి పండించిన మక్క పంట అగ్నికి ఆ హుతైంది. మహబూబాబాద్ జిల్లా బ య్యారం మండలం చెరువుముందు కొత్తగూడెం శివారులోని ఓ రైతు మక్కపంటకు శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకున్నది. ఈదురుగాలులు వీ యడంతో ఆ మంటలు కిలో మీటర్ల మేర వ్యాపించాయి. రైతులు గమనించి వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా చాలాసేపటి వరకు అదుపులోకి రాకపోగా మ రింత తీవ్రమయ్యాయి. స్థానిక ప్రజలు ఒ క్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల సమీపంలోకి వచ్చిన మంటలను సీఐ రవీందర్, స్థానికులతో కలిసి అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. సుమారు 200 ఎకరాల్లో ఉన్న మక్క కర్రలు కాలిపోగా, కల్లాల్లోని 50 ఎకరాల్లోని మక్క కంకులు కాలిబూడిదయ్యాయి. పలువురు రైతుల బోరు మోటర్లు, కరెంటు స్తంభాలు, వైర్లు కాలిపోయాయి. నష్టపోయిన రైతులను ప్ర భుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.
గణేశ్పల్లిలో మకజొన్న పంట దగ్ధం
మొగుళ్లపల్లి, ఏప్రిల్ 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం గణేశ్పల్లి, పెద్దకోమటిపల్లి గ్రామాల శివారుల్లో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలకు మకజొన్న పంట కాలి బూడిదైంది. గణేశ్పల్లి శివారులో శనివా రం మధ్యాహ్నం పంట చేలల్లో ప్రమాదవశాత్తు ఓ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి. దాదాపు 30 ఎకరాల్లో పం టకు మంటలు వ్యాపించాయి. వాటిని ఆర్పడానికి రైతులు, స్థానికులు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదు పు చేశారు. చేతికొచ్చిన పంట తమ కండ్ల ముందే మంటల్లో కాలి బూడిదైందని రైతు లు కన్నీటి పర్యంతమయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

