హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): మక, జొన్న పంటలను పీఎస్ఎస్ సీమ్‌లో చేర్చాలని, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25% కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సోమవారం మరోమారు లేఖ రాశారు. సెంట్రల్ పూల్‌లో కేంద్ర నోడల్ సంస్థ ద్వారా శనగ పంటను 29,860 టన్నులు , పొద్దుతిరుగుడు 3,690 టన్నులు కొనుగోళ్లకు కేంద్రం అనుమతించిందని, అయితే, ఈ పరిమితి ప్రకారం కొనుగోళ్లు గతవారమే పూర్తయ్యాయయని వివరించారు.
ఇంకా రైతుల వద్ద పంట మిగిలివుందని, కొనుగోళ్ల కోసం మారెట్లకు తీసుకొస్తున్నారని పేరొన్నారు. మకజొన్న పంటను కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా 14.89 లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు, 2.76 లక్షల టన్నుల జొన్న పంటను కొనుగోళ్లు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.