హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): ప్రాణవాయువు రవాణాకు ఎలాంటి అంతరాయం లేకుండా రాచకొండ పోలీసులు మహీంద్ర లాజిస్టిక్స్ సాయంతో ‘ఆక్సిజన్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వాహనాలను గురువారం ఎల్బీనగర్లోని రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేశ్‌భగవత్, మహీంద్ర లాజిస్టిక్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 7 ఆక్సిజన్ రీ ఫిల్లింగ్ యూనిట్లు ఉన్నాయని, ఈ యూనిట్ల వద్ద బందోబస్తు ఏర్పాటుచేశామని సీపీ తెలిపారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, క్రైం డీసీపీ యాదిగిరి, సంస్థ ప్రతినిధులు మీట్ గొరాడియా, ఎడ్వర్డ్ రొజారియో పాల్గొన్నారు. ఈ ఉచిత రవాణ సౌకర్యాన్ని పొందేందుకు రాచకొండ కొవిడ్ కంట్రోల్ నంబర్- 9490617234, +91-7386420259లో సంప్రదించాలన్నారు.