యువతి వెంటపడ్డాడని యువకుడి హత్య?
ప్రేమపేరుతో యువతి వెంటపడుతున్న ఓ యువకుడిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయగా.. తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంటకు చెందిన మహేశ్‌గౌడ్ గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు.
- ఎంత చెప్పినా వినకపోవడంతో చితకబాదిన అమ్మాయి తండ్రి
- తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ మృతి
సదాశివపేట, జనవరి 4: ప్రేమపేరుతో యువతి వెంటపడుతున్న ఓ యువకుడిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయగా.. తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంటకు చెందిన మహేశ్‌గౌడ్ గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. గత నెల 31న ఆ యువతి ఇంటి ముందు ముగ్గులు వేస్తుండగా తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు. దీన్ని గమనించిన యువతి తమ్ముడు.. మహేశ్‌గౌడ్ సెల్‌ఫోన్‌ను పగులగొట్టాడు.
ఇదే విషయాన్ని యువతి తండ్రి రాములుకు చెప్పడంతో.. ఆయన తమ అమ్మాయి వెంటపడొద్దని హెచ్చరించాడు. అయినా వినకుండా మరుసటి రోజు కూడా యువతి వెంటపడుతుంటే మహేశ్‌గౌడ్‌ను రాములు కొట్టాడు. గాయాలపాలైన మహేశ్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మహేశ్‌గౌడ్ మద్యం తాగేవాడని, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు సమాచారం. అనారోగ్య కారణాల వల్ల మరణించాడా? లేక యువతి కుటుంబ సభ్యులు దాడి చేయడం వల్ల మృతి చెందాడా? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Died
- Hospital
- mahesh goud
- murder
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

