హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదివారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఎన్నారైల తరుఫున ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వివిధ దేశాల్లో పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించారు. ఏప్రిల్ 27న నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావోత్సవాలకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. వివిధ దేశాల్లో నిర్వహించనున్న వేడుకలకు బీఆర్ఎస్ ముఖ్యనాయకులు హాజరవుతారని వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.