హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల డిమాండ్ చేశారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కొండా సురేఖ అలా వ్యాఖ్యానించటం సరి కాదన్నారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ హైకమాండ్ ఆమెపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.