హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): యూపీఎస్సీ విడుదల చేసిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ప్రొటెక్షన్ (సీఏపీఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్ ఫలితాల్లో రాష్ట్ర రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ స్టూడెంట్స్ హవా కొనసాగించారు. సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీలోని అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల కోసం ఎంపికైన 312 మందిలో మహేశ్‌భగవత్, అతని బృందం మెంటార్షిప్ అందించిన 60 మందికిపైగా అభ్యర్థులు ఎంపికయ్యారు.
వీరిలో తెలంగాణకు చెందిన పడమటి అన్వేష్‌రెడ్డి (27 ర్యాంక్), ఐండ్ల ప్రద్యుమ్నారెడ్డి (177 ర్యాంక్) పాటు మరికొందరు ఉన్నారు. ఏడీజీ మహేశ్‌భగవత్‌తో పాటు అభ్యర్థులకు మెంటార్షిప్ ఇచ్చిన వారిలో మహారాష్ట్ర ఉన్నత విద్యా డైరెక్టర్ డాక్టర్ శైలేంద్ర దేవలంకర్, సీఆర్పీఎఫ్ డీఐజీ ఎంఏ రిజ్వాన్, ఎస్ఎస్బీ డీఐజీ డీఎన్ భోంబే, సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ ప్రతాప్ పుండే, సీఐఎస్ఎఫ్ డీసీ రాకేశ్, ఐఆర్ఎస్ డీసీ కస్టమ్స్ నితేశ్ పథోడ్ తదితరులు ఉ న్నారు.
వీరి సారథ్యంలో సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ క్లియర్ చేసిన వారిలో 8, 9, 10, 11, 18, 19, 26, 27, 28, 29, 33, 52, 53, 56, 61, 64, 66, 69, 81, 88, 92, 95, 103, 114, 117, 125, 127, 131, 137, 146, 177, 180, 187, 190, 191, 198, 208, 209, 214, 215, 219, 220, 221, 252, 8 241 , 251, 259, 262, 263, 272, 281, 284, 287, 292, 304, 305 ర్యాంకుల అభ్యర్థులు ఉన్నారు. వీరిందరినీ మహేశ్‌భగవత్ అభినందించారు.