హైదరాబాద్ : అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే 195వ జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 11న ఫూలే జయంతి వేడుకలను హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫూలే జయంతి ఉత్సవాల నిర్వహణకు రూ. 20 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది.