Gandhi Jayanti | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): అహింసనే ఆయుధంగా మలచిన సమరయోధుడు, మానవాళికి మానవత్వం నేర్పిన మహనీయుడు మ హాత్మాగాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్మరించుకున్నారు. బుధవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర పోరాట దిక్సూచి అని కొనియాడారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్బహ దూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను సీఎం రేవంత్రెడ్డి స్మరించుకున్నారు.
పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.