Shirdi Accident | మోత్కూరు, జనవరి16: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకు చెందిన నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శ్యాంశెట్టి కృష్ణమూర్తి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లోని గ్రీన్‌పార్క్ సమీపంలో నివాసం ఉంటున్నారు.
వీరు దైవదర్శనం కోసం ఈ నెల 12న బంధువులతో కలిసి కలిసి షిర్డీకి బయలుదేరారు. బుధవారం రాత్రి నాసిక్‌కు వెళ్లడం కోసం ఓ మినీ బస్సు అద్దెకు తీసుకున్నారు. గురువారం ఔరంగాబాద్ వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేస్తుండగా బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కృష్ణమూర్తి భార్య ప్రేమలత (55), కుమార్తె తొలుపునూరి ప్రసన్నలక్ష్మి (45), మనుమరాలు తొలుపునూరి అక్షిత (22), మనుమడు వైద్వీత్( 6నెలలు) మృతి చెందారు. కృష్ణమూర్తి, అతని అల్లుడు తొలుపునూరి శ్రీనివాస్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.