5న బుద్ధవనం వరకు మహార్యాలీ
ఈ నెల ఐదున బుద్ధుడి 2,567వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం వరకు 200 కార్లతో మహార్యాలీ నిర్వహించనున్నట్టు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పరంధాములు, శీలం ప్రభాకర్, కేకే రాజా, ఇఫ్లూ ప్రొఫెసర్ సంతోష్రౌత్, మైత్రివీర్ నాగార్జున వెల్లడించారు.
- 200 కార్లతో అంబేద్కర్ విగ్రహం నుంచి సాగర్ బుద్ధవనం వరకు
- బుద్ధ జయంతినాడు నిర్వహణ
- ప్రారంభించనున్న మంత్రులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): ఈ నెల ఐదున బుద్ధుడి 2,567వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం వరకు 200 కార్లతో మహార్యాలీ నిర్వహించనున్నట్టు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పరంధాములు, శీలం ప్రభాకర్, కేకే రాజా, ఇఫ్లూ ప్రొఫెసర్ సంతోష్రౌత్, మైత్రివీర్ నాగార్జున వెల్లడించారు.
మహార్యాలీని రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని మంగళవారం పేర్కొన్నారు. 200 కార్లలో బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులతోపాటు పలువురు ప్రముఖులు ఐదో తేదీన ఉదయం 7 గంటలకు బుద్ధవనానికి బయలుదేరుతారని పేర్కొన్నారు.
బుద్ధవనంలో సాయంత్రం 5.30 గంటలకు పబ్లిక్ టాక్ ఉంటుందని చెప్పారు. ‘ఫిలాసపీ ఆఫ్ బుద్ధిజం: ఇట్స్ రిలవెన్స్ ఫర్ సోషల్లీ ఇంక్లూసివ్ నేషన్‌హుడ్ అండ్ డెమోక్రసీ ఇన్ ఇండియా’ అనే అంశంపై యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ ప్రసంగిస్తారని తెలిపారు. పర్యాటక రంగాలతోపాటు ఆధ్యాత్మిక కేంద్రాలను ముఖ్యంగా నాగార్జునసాగర్‌లో బుద్ధవనాన్ని పునర్నిర్మించి ప్రపంచవ్యాప్తంగా బుద్ధిస్ట్లను ఆకర్శించేలా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ప్రశంసించారు. బుద్ధవనాన్ని, అక్కడి విశేష చరిత్రను తెలంగాణ సమాజానికి చూపాల్సిన అవసరం ఉన్నదని బుద్ధిస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

